నవంబర్ నెల(2013) ఇంటర్వ్యూ వనజ తాతినేని గారితో...!






1.తెలుగు బ్లాగు ప్రపంచం లోనికి ఎప్పుడు అడుగు పెట్టారు..?దానికి గల ప్రేరణలు ఏమిటి?

 వనజ : నేను  బ్లాగ్ ప్రపంచంలో అడుగిడి దాదాపు మూడేళ్ళు కావస్తుంది . తెలుగు కళ (పద్మ కళ) గారు నాకు స్ఫూర్తి. అయితే నాకు బ్లాగ్ క్రియేట్ చేసి ఇచ్చిన ఒక ఫ్రెండ్ ప్రోత్సాహం వల్ల నేను ఈ బ్లాగ్ లోకంలోకి అడుగు పెట్టాను. నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం . అలాగే  ఇతరుల బ్లాగ్ లలో ఉండే సాహిత్యంకి దగ్గరవ్వాలని నేను బ్లాగ్ లోకంలోకి వచ్చి పడ్డాను    . 



2.బ్లాగు టపాలు రాయడంలో మీ అనుభూతులు వివరించగలరా..?

వనజ:  నేను ఎప్పుడూ బ్లాగ్ వ్రాయడాన్ని సీరియస్ గానే తీసుకున్నాను.  బ్లాగ్ లో ఉన్న పోస్ట్ లలో  మూడొంతుల  పైగా పోస్ట్  లని  నేను చాలా హార్ట్ ఫుల్ గా వ్రాసాను . అందులో నా వ్యక్తిగత అనుభవాలు, నా హుట్టూ వారి అనుభవాలు, అనేక సామాజిక సమస్యలు, అనుభూతులు, నా భావోద్వేగాలు కలగలసి ఉన్నాయి. నా గురించి నేను చెప్పుకునేటప్పుడు "మనసు చెప్పిందే చేస్తాను " అని ట్యాగ్ లైన్ ఉండేది . ఇప్పుడు అలాంటి పరిచయం అవసరం లేదనిపించి తొలగించాను. 

3.మీకు నచ్చిన కొన్ని బ్లాగుల గురించి చెప్పగలరా?. 

వనజ: నేను సమయం ఉన్నప్పుడు అందరి బ్లాగ్ లు చదవడానికి ఇష్టపడతాను.  అంశం నచ్చితే తరచూ  ఆ బ్లాగ్ ని సందర్శించడం, లేకపోతే ఆ బ్లాగ్ వైపు అసలు చూడనే చూడను నా బ్లాగ్ లో నాకు నచ్చిన బ్లాగ్ ల లింక్స్  ఉన్నాయి . అలాగే మరి కొన్ని బ్లాగ్ లని తరచూ చూస్తాను. 

4.ఇంకా మీ ఇతర హాబీలు గురించి చెబుతారా..?

వనజ: చదవడం, వినడం, వ్రాసుకోవడం.. 

5.ఇంకా ఏమైనా మీ గురించి పూదండ ద్వారా చెప్పాలనుకుంటున్నారా..?

 వనజ : బ్లాగ్ ప్రపంచం ద్వారా ..ఈ మూడేళ్ళలో నేను చాలా నేర్చుకున్నాను . నేర్చుకుని మరీ వ్రాసాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది .  నన్ను నేను ప్రూవ్ చేసుకునే దశలో అంటే నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం కోసం, బాగా వ్రాయడం కోసం  నేను  వ్యక్తిగత సమయాన్ని చాలా  కోల్పోయాను.  అనారోగ్యంలోను , వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుని కూడా బ్లాగ్ వ్రాయడానికే సమయం కేటాయించాను.అఫ్కోర్స్ అందువల్ల నాకు సంతోషం మిగిలింది. చాలామంది బ్లాగ్ మితృలు ఇచ్చిన ప్రోత్సాహం, వ్యాఖ్యల ద్వారా అందించిన అభిప్రాయాలు వల్ల నేను చాలా సులభంగా చాలా కథలు వ్రాయగల్గాను. అయితే ఎవరో వచ్చి ఏదో అంటూనే ఉంటారు. క్రొత్తల్లో చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు రాటుదేలాను. :)  కొంత మానసికంగా నలిగిపోయాను కొంత కాలం విశ్రాంతి తీసుకుని మళ్ళీ వ్రాయడం మొదలెట్టాలి.  ముఖ్యంగా కథలు వ్రాయడంలో శ్రద్ద తీసుకుంటాను. నా వంతు భాద్యతగా  సమాజ సేవ చేయాలనే అభిలాష ఉంది. అందుకు తగిన మార్గాలని అన్వేషిస్తున్నాను. ఇంకా  చాలా సాహిత్యం చదవాలి.  .      .   

6.తోటి బ్లాగరులకి ఏమైనా సూచనలు,సలహాలు ఇవ్వగలరా?

వనజ: మనం  వ్రాసినదానిని ఎవరికో పంపి ప్రచురణ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇదో చక్కని వేదిక మనం వెలిబుచ్చిన భావాలు నచ్చిన వారు మళ్ళీ మళ్ళీ బ్లాగ్ కి విచ్చేసి చదివి మెచ్చుకుని అభిప్రాయాలని తెలిపి వెళుతూ ఉంటారు. బయట పత్రికలలో ప్రచురింప బడ్డ రచనల పై స్పందన కన్నా.. ఇక్కడ స్పందన ఎక్కువ. అయితే ఇక్కడ అందరూ చదివే అవకాశం లేదు కనుక బాహ్య ప్రపంచానికి బ్లాగ్ రచయితలు తెలిసే అవకాశం లేదు. అయినప్పటికీ నిరాశపడక వ్రాస్తూనే ఉండటం చేయాలి . ముందు ముందు తెలుగు బాషలో బ్లాగ్ ల స్థానం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి అని నా అభిప్రాయం . అలాగే బ్లాగర్ లు భాద్యతతో వ్రాయడం అనేది మర్చిపోకూడదు . భావప్రకటనకి వేదిక అయినంత మాత్రాన ఏది పడితే అది ఎలా పడితే అలా వ్రాయకుండా ఉండటం మంచిది . 

7.మీ బ్లాగు విషయం లో మీరు పొందిన ప్రశం షలు గురించి చెబుతారా..? 

 వనజ: నేను ఒక పౌరురాలిగా ఎదుర్కునే అనేక సామాజిక సమస్యలు, వ్యక్తి గత అనుభవాలని వ్రాయడంలో నేను  కృతకృత్యురాలిని అయిన విషయం ఇతరులు  ప్రశంసలు ఇవ్వడం ద్వారానే తెలిసింది. నా ఆలోచనా దోరణి, నా వ్యక్తీకరణ చాలా మందిని నా బ్లాగ్ వైపు ఆకర్షించాయి. అందుకు తార్కాణం నా బ్లాగ్ ని సందర్శించే వీక్షకుల సంఖ్య, అలాగే ఇండీ బ్లాగర్ గా టాప్ టెన్ బ్లాగర్ లలో ఒకరిగా ఉండటం.. నాకు చాలా ఆనందం ఇచ్చింది . అయితే ఈ రాంక్ లు ముఖ్యం కాదు . నన్ను నేను నిరూపించుకోవదానికే నేను ఆ ప్రయత్నం చేసాను . నాకు నేనే పోటీగా భావించుకుని ఇంకా ఇంకా బాగా వ్రాయాలి అనే తపనతో పాటు ఓ.. మంచి బ్లాగర్ గా నాకు మంచి విషయాలని అందించే భాద్యత ఉందనుకుంటున్నాను . అందుకే ఆచి తూచి పోస్ట్ లని వ్రాస్తున్నాను. ఇప్పుడు ఇంకా ప్రశంసలు పొందుతున్నాను అది నాకు చాలా ఆనందమిచ్చి భాద్యత ని పెంచింది. అంతకన్నా ఏం కావాలి చెప్పండి !? 

పూదండ ద్వారా మీరు నా ఈ పరిచయాన్ని తోటి బ్లాగర్ లకి అందిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు