శ్రీ కదిరి సురేష్ బాబు

SEPTEMBER-2013

                                                  

సెప్టెంబర్ నెల ఇంటర్వ్యూ కదిరి సురేష్ బాబు గారితో...!



             Visit his blog here: www.sureshkadiri.blogspot.com







1.బ్లాగుని ప్రారంభించాలని ఎందుకు అనిపించింది...ఏవైనా లక్ష్యాలు ఉన్నాయా..?

       మొదట బ్లాగు మొదలుపెట్టేటప్పుడు ఎటువంటి లక్ష్యాలూ లేవు. ఎందుకంటే అప్పుడు తెలుగు బ్లాగులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. కాని తర్వాత రానురానూ మన భారతదేశగొప్పతనాన్నీ, వేదాల,మహర్షుల గురించీ అందరికీ చెప్పాలనే లక్ష్యం ఏర్పడింది. ఇంకా తెలుగుభాషకు ఎదురవుతున్న నిరాదరణను పోగొట్టడానికి కృషి చేయాలనే లక్ష్యం కూడా ఉంది.


2.బ్లాగు ప్రపంచంలోని మీ అనుభవాలని విశదీకరించగలరా..?

       అందరూ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడానికి బ్లాగులు మంచి వేదిక. కొన్ని టపాలు వ్రాసినప్పుడు ఎంతో దారుణమైన వ్యతిరేకత కొందరి నుండి ఎదురైంది. కానీ అంతకుమించి అనుకూలాలు కూడా వ్యక్తమైనాయి.దీనివలన మనం చేసేపని మంచిదైనప్పుడు మెజారిటీ మనవైపే ఉంటుందని అర్థమైంది.

     
3.మీ భావజాలంపై ప్రభావం చూపించిన వ్యకుల,సంఘటనల గురించి చెప్పండి

         వ్యక్తులు అంటే నాజీవితంపై స్వామివివేకానంద ప్రభావం 90శాతం పైనే ఉంది. వీరేకాక శ్రీరామకృష్ణపరమహంస, హనుమంతుల ప్రభావం కూడ ఉంది.ఇక సంఘటనల విషయానికి వస్తే సంఘంలో జరుగుతున్న అరాచకాలన్నీ నామనసుపై కొద్దోగొప్పో ప్రభావం చూపిస్తుంటాయి.


4.మీకు నచ్చిన బ్లాగుల గురించి తెలుపగలరా..?

       చాలా బ్లాగులు ఉన్నాయండీ. ఆలోచనాతరంగాలు,హరిసేవ,లీలామోహనం,ఆంధ్రామృతం,నవీనభారతంలో నా పౌరొహిత్యం మొదలగు బ్లాగులు ఉదాహరణలు.ఇవేకాదు మంచి విషయాలు చెప్పే బ్లాగులు అన్నీ నాకు నచ్చుతాయి. భావోద్వేగాలు రెచ్చగొట్టే బ్లాగులు,మతాల గురించి పూర్తిగా తెలియకుండా లేనిపోని అభాండాలు వేసే బ్లాగులు నాకు ఇష్టముండవు.

5.మీ హాబీలు లేదా నచ్చిన వ్యాపకాల గురించి చెప్పండి.

      పుస్తకపఠనం (ముఖ్యంగా ఆధ్యాత్మిక మరియు సైన్సు పుస్తకాలు, జీవిత చరిత్రలు, అనుభవాలు చెప్పే పుస్తకాలు). క్రికెట్,క్యారంస్,చెస్.


6.పూదండ అగ్రిగేటర్ ద్వారా ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా..?
  
      బ్లాగుల ద్వారా మనం బయటకుపోయి చేయలేని ఎన్నోమంచిపనులకు మనం సహాయం చేయవచ్చు. ఇంకా చదివే అలవాటును పెoపొందిoపచేయవచ్చు.ముఖ్యం గా మన తెలుగు భాష అభివృద్ధికై ఎంతో పోరాడవచ్చు. పెద్దలు తమ జీవిత అనుభవాలను చెప్పడానికి బ్లాగులు మంచి వేదికలు. ఉద్యోగసహాయానికి కూడ ఉపయోగపడతాయి. మొత్తంగా సమాజానికి ఉపయోగపడే బ్లాగులు ఇంకా ఎన్నెన్నో రావాలని ఆశిస్తున్నాను.